బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో గురువారం సివిల్ సప్లై అధికారులు పలు రైస్ డిపోలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన సూమారు 73 కిలోల పీడీఎస్ బియ్యం, నూకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీటీ సివిల్ సప్లై అధికారి షరీఫ్ ఆధ్వర్యంలో డిపోలపై తనిఖీలు చేపట్టారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రైస్ డిపోను సీజ్ చేశారు.