Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2025, 8:20 pm Posted by : ramakrishna

అందరి సహకారంతో నగర సుందరీకరణ

  • నగరంలో 800 కోట్లకు పైగా నిధులతో  అభివృద్ది
  • నగర మేయర్ నీతూ కిరణ్

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ  : నగర  ప్రజల సహకారంతో నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని ఛాంబర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ మళ్ళీ అవకాశం వస్తే ప్రజలకు మరింత సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని,ఈ నెల 27 న మా పాలన పూర్తవుతుందన్నారు. అభివృద్ది కోసం సహకరించిన మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్త,జీవన్ రెడ్డి,బాజిరెడ్డి,మాజీ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన మున్సిపల్ కార్యాలయాన్ని మా పాలన పూర్తి చేశామని గుర్తు చేశారు. కౌన్సిల్ హల్ ను అద్భుతంగా నిర్మించామన్నారు. రఘునాథ మినీ ట్యాంక్ బండ్ గా రూపొందించామన్నారు. నగరంలో ప్రజల ఆరోగ్యం కొరకు పార్కులలో ఓపెన్ జీమ్,రైల్వే కమాన్ వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అర్ యు బీ నిర్మించిన ఘనత మాది మాకే దక్కిందన్నారు. నగర అభివృద్ధి లక్ష్యంగా పార్టీలకతీతంగా అన్ని డివిజన్లో సిసి రోడ్లు,డ్రైనేజీలు నిర్మించామన్నారు.ఇంటింటికి నల్ల నీరు ఇచ్చేందుకు కృషి చేశామని,నాగారం లో కోటిన్నర రూపాయలతో నల్ల కలెక్షన్లు ఇచ్చామని,పరిశుద్ధ సమస్యలను పరిష్కరించేందుకు 330 మంది కార్మికులను,కొత్త వాహనాలను తీసుకోవడం జరిగిందని,నగర సుందరీకంలో భాగంగా 20 కిలోమీటర్ల మేర సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. నగరంలో అనేక వైకుంఠధామాలు నిర్మించామని,నగరంలో ఐటిఎఫ్ నిర్మించి యువతకు ఉపాధి కల్పించామన్నారు. స్మార్ట్ సిటీకి లాగా నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకున్నమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉమారాణి, యమున ఉన్నారు.