సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ మరియు వర్కర్స్ యూనియన్ (సి ఐ టీ యూ) జిల్లా కమిటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు పోలీస్ నిర్బంధాన్ని దాటుకొని డి పి ఓ కార్యాలయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి జంగం గంగాధర్, కార్మికులకు మద్దతుగా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి కొండా గంగాధర్ ...