సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మృతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా సిపియం అనుబంధ కార్మీక సంఘం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న నూర్జహన్ శనివారం ప్రైవేట్ ఆసుపత్రిలోనే గుండేపోటుతో చనిపోయారు. ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడకు చెందిన నూర్జహన్ కార్మిక నాయకురాలిగా సుపరిచితులు. ఆశ, అంగన్ వాడీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమస్యలపై పోరాడుతున్నారు. గతంలో అసెంబ్లి, మున్సిపల్ ఎన్నికలలోను నూర్జహన్ సిపియం తరుపున పోటీ చేశారు. కామ్రేడ్ నూర్జహన్ ఆకస్మిక మరణం...