నింబాచల గిరి ప్రదక్షిణ
గోవింద నామ స్మరణతో మార్మోగిన నింబాచలం భీమ్‌గల్, బతుకమ్మ : నింబచల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నింబాచల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నింబాచల గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మోక్షం తో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం. లింబాద్రి గుట్టపై అక్టోబర్ 27 నుండి శ్రీ వారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతుందగా,అందులో భాగంగా శ్రీ లక్మీ నరసింహుని ఆయుధం అయిన శ్రీ చక్రస్వాముల(చక్రం) వారిని గిరి ప్రదక్షిణ గావించారు. శ్రీ వారి ఉత్సవ యాగ సంరక్షణమునకు...