ఓయూలో నిరసనలు, ధర్నాలపై నిషేధం.. సర్య్కూలర్ జారీ

వెబ్ న్యూస్, బతుకమ్మ :   ఎన్నో ఉద్యమాలకు వేదికైన హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలపై నిషేధం విధించారు. ఈమేరకు తాజాగా యూనివర్సిటీ రిజిస్ట్రార్  సర్య్కూలర్ జారీ చేశారు.  యూనివర్సిటీలో ప్రశాంతంగా తరగతులు, కార్యకలాపాలు జరగాలని సూచించారు. విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలోని ప్రవేశించి నిరసన ప్రదర్శనలు, ధర్నాలుచేయడంతో పరిపాలన పనులకు ఆటంకం కలుగుతోందని యూనివర్సిటీ సర్క్యూలర్ లో  తెలిపారు.  అనుమతి లేకుండా వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.