Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 1:05 pm Posted by : ramakrishna

టీటీడీ పరకామణి వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు

తిరుమల, బతుకమ్మ :  టీటీడీ పరకామణి వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. చోరీపై నమోదైన కేసులో లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడంపై ఉన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. చోరీకి పాల్పడిన రవికుమార్,అతడి కుటుంబ సభ్యుల ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఆస్తులు బదలాయించారా అనే అంశాన్ని పరిశీలించాలని తెలిపింది. కేసు రాజీ వ్యవహారంపై టీటీడీ బోర్డు, అధికారుల పాత్రపై విచారణ చేయాలని ఆదేశించింది. నివేదికను తదుపరి విచారణలోగా అందించాలని సీఐడీ, ఏసీబీ లకు సూచించింది.