మహిళను చితకబాదిన సీఐ
. పర్సు పోయిందని ఫిర్యాదు చేస్తే లాఠీతో కొట్టాడు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తన పర్సు పోయిందని ఫిర్యాదు చేసిన మహిళను సీఐ లాఠీతో విచక్షణారహితంగా చితకబాదాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో చోటుచేసుకుంది. రెంజల్ మండలం దూపల్లికి చెందిన బోయ భాగ్య తన కుమారుడితో కలిసి ఎడపల్లి మండలం జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలకు హాజరైంది. ఉత్సవాల్లో ఆమె పర్సు పోవడంతో అక్కడే ఉన్న పోలీసు అవుట్ పోస్టులో బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబుకు ఫిర్యాదు...