ఏసీబీ కేసులో సిఐకి జైలు శిక్ష

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   ఏసీబీ కేసులో పోలీసు సర్కిల్ ఇన్స్ పెక్టర్ జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్ రెండవ అదనపు ప్రత్యేక ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. 2011లో డిచ్ పల్లి ఎస్సైగా పని చేసిన బాలాజి యూనివర్సిటీ వద్ద ఒక కేసులో లంచం తీసకుంటూ ఆనాడు ఏసీబీకి చిక్కాడు. ప్రస్తుతం సిఐగా పని చేస్తున్న బాలాజికి ఏసీబీ న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.