నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పోలీస్ కమీషనరేటు పరిధిలోని ప్రజలందరికి, ప్రత్యేకంగా క్రైస్తవ సోదరీ సోదరీమణులకు జీసస్ క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ పండగ సందర్భంగా పోలీస్ శాఖ నుండి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఇన్చార్జ్ సిపి సింధు శర్మ పేర్కొన్నారు. ఈ సంవత్సర కాలంలో ప్రజలందరు వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషములతో గడపాలని ఆమె అన్నారు. ఈర్ష్య, ద్వేషం, అసూయలతో కూడిన చీకట్లను పారద్రోలి ” ప్రేమ” అనే ” దీపం ” వెలిగించి పది మందికి వెలుతురును ఇవ్వాలని ఆకాంక్షించారు.