బతుకమ్మ,ముప్కాల్: ముప్కాల్ మండలంలోని రేంజర్ల గ్రామంలో గల విజ్ఞాన్ పాఠశాలలో సోమవారం సపోజ్ క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. చిన్న పిల్లలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి. పలువురు పిల్లలు క్రిస్మస్ తాత వేషధారణ ధరించి పిల్లలందరికీ చాక్లెట్ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సోహెల్ ప్రధానోపాధ్యాయులు విద్యాకర్ పవర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
