చొక్కాయ్యగుట్ట వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
గ్రామాలయం నుండి గుట్టకేగిన వెంకన్న భీమ్ గల్, బతుకమ్మ : మార్గశిర శుద్ధ షష్ఠి సుముహూర్తంన పట్టణంలోని చొక్కయ్యగుట్టపై వెలసిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి(శ్రీవెంకన్న) బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి యేటా మార్గశిర మాసంలో నిర్వహించినట్లేఈ యేడు మూడు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ బొదిరే సంఘం సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజైన శుక్రవారం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఉదయం పట్టణంలోని గ్రామాలయం నుండి సుహాసినుల మంగళహారతులు, మంగళవాయిద్యాల మధ్య గోవిందా నామస్మరణతో ఊరేగింపుగా...