Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 6:50 pm Posted by : ramakrishna

21 నుండి చొక్కయ్య గుట్ట బ్రహ్మోత్సవాలు

భీమ్ గల్, బతుకమ్మ : పట్టణ కేంద్ర శివారులోని చొక్కయ్య గుట్టపై వెలసిన శ్రీలక్ష్మివెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుండి  నిర్వహించడం జరుగుతుందని దేవస్థాన కమిటీ సభ్యులు, అర్చకులు సింహాగ్రి స్వామి తెలిపారు. బుధవారం చొక్కయ్య గుట్ట పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 21 న ఉదయం స్వామి ఉత్సవ విగ్రహాలు గ్రామాలయం నుండి గుట్టపైకి ఎదుర్కోలు, 22న ఉదయం ప్రాభోదిక, విశ్వక్షేనవిధి, అభిషేకం, ఎదుర్కోలు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, మహాపూర్ణహుతి, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ, స్వామి వారికి ఉంజల సేవా, స్వామి కీర్తనలు ఉంటాయన్నారు.23న సత్యనారాయణ వ్రతం, సహస్ర నామ పారాయణం, స్వామి ఉత్సవ మూర్తులను కొండపై నుండి గ్రామాలయానికి చేర్చడం తో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. మూడు రోజుల పాటు కొండపై నిర్వహించే ఉత్సవాలలో అన్నప్రసాదం భక్తులకు వితరణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని దేవస్థాన కమిటీ సభ్యులు, అర్చకులు కోరారు.

Chokkayya Gutta Brahmotsavam from 21st