Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 September 2025, 5:20 pm Posted by : ramakrishna

కవితకు చింతమడక వాసుల ఆహ్వానం

  • 21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని పిలుపు

హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తో ఆమె తండ్రి కేసీఆర్ సొంత ఊరు చింతమడక గ్రామస్తులు భేటీ అయ్యారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చింతమడక గ్రామస్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఈనెల 21న ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు రావాలని ఆహ్వానించారు. దీనిపై కవిత స్పందిస్తూ.. గొప్ప ఉద్యమకారుడిని కన్న గొప్ప ఊరు మా చింతమడక..  ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను బతుకమ్మకు ఆహ్వానించడం సంతోషంగా ఉందని అన్నారు. తాను చింతమడక నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు.. తన చిన్నప్పుడు చింతమడక లో బతుకమ్మ ఆడిన రోజులు ఇంకా కండ్ల ముందే ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.. ఈ సమయంలో మీరంతా వచ్చి తనకు ఇచ్చింది మామాలు ధైర్యం కాదన్నారు.

Chintamadaka residents' invitation to Kavitha