Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 5:57 pm Posted by : ramakrishna

జాతీయ స్థాయి పురస్కారానికి చింతల ఎంపిక హర్షనీయం

  • కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్

 

భీమ్ గల్, బతుకమ్మ : జాతీయ స్థాయి బాల సాహిత్య పురస్కారానికి జిల్లాకు చెందిన చింతల శ్రీనివాస్ గుప్తా ఎంపికవ్వడం హర్షనీయమని కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా పని చేస్తున్న శ్రీనివాస్ స్థానిక మాణిక్ భవన్ స్కూల్ లో ఉన్నత విద్యను పూర్తి చేసి, తెలుగులో ఏం ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన విరివిగా సాహితీ సృజనలు చేస్తూ కవిగా, నాటకకర్తగా, పద్యకవిగా చిత్రకారుణిగా, బాల సాహితీ శిల్పిగా బహుళ రంగాల్లో రాణించిడని అన్నారు. వీరీ సాహితి సేవను గుర్తించి జాతీయ స్థాయి బాల సాహితి పురస్కారం అందించడం గొప్ప విషయం అన్నారు. మున్ముందు సాహితీ రంగంలో అజరామరమైన సేవలను శ్రీనివాస్ జిల్లాకు అందించాలని కంకణాల కోరారు.