తెలంగాణలో వణికిస్తున్న చలి
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. ప్రత్యేకంగా ఉదయం, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాబోయే మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు చలికి త్వరగా గురయ్యే అవకాశం ఉండటంతో వారు మరింత అప్రమత్తంగా...