ఖాజాపూర్ స్కూల్లో చిన్నారుల హోలీ కేరింతలు

బతుకమ్మ, సాలురా : హోలీ పర్వదినాన్ని సందర్భంగా సాలూర మండలంలోని ఖాజాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో చిన్నారులు ముందస్తు హోలీ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు హోళికా దహనము, హోలీ పండుగ విశిష్టతను పౌరాణిక గాధను విద్యార్థులకు వివరించారు. అదనంతరం విద్యార్థులు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చిన్నారులు కేరింతలతో  హొలీ పాటలపై నృత్యాలు, కోలాటాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ ఉపాధ్యాయులు జ్యోతి, లక్ష్మణ్, సాయిలు, హన్మాండ్లు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. 1254