Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2024, 7:13 pm Posted by : ramakrishna

లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

ఆర్మూర్, బతుకమ్మ : లిల్లీపుట్ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులందరూ చక్కని దుస్తులతో అందరిని ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా చక్కని నృత్యాలతో అందరినీ ఎంతగానో ఆలరించారు. అదేవిధంగా బాలలను రక్షించండి అనే ఒక నాటికతో 4వ తరగతి విద్యార్థులు చక్కని ప్రదర్శన చేశారు తదనంతం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులందరికీ స్వీట్స్ పంచి అందరి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ బాలల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క బాలల దినోత్సవం జరుపుకుంటామని నేటి బాలలే రేపటి పౌరులని తెలిపారు.  ప్రిన్సిపాల్ దాసు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Children's Day is celebrated at Lilliput School