సాధన సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ ఉత్సవాలు

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   అంతర్జాతీయ బాలోత్సవాల సందర్భంగా సాధన సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నగరంలోని గ్రేసీ పాఠశాలల్లో సక్సెస్ టు జస్టిస్ ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాధన సంస్థ నగర కోఆర్డినేటర్ మధుసూదన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్యారం బోర్డ్, కబడ్డీ, చెస్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మికులు లేని, బాల్యవివాహాలు లేని, బాలల అక్రమ రవాణా లేని నిజామాబాద్ జిల్లాగా రాష్ట్రంగా...