Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2024, 7:32 pm Posted by : ramakrishna

శ్రీ సరస్వతీ విద్యా మందిర్ లో బాలల దినోత్సవ వేడుకలు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూరు పట్టణం లోని టీచర్స్ కాలనీ లో గల శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ మాట్లాడుతూ మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజుని ప్రతి సంవత్సరం బాలల దినోత్సవ వేడుక చేసుకోవడం విదితమే .నెహ్రూ కి పిల్లలు అంటే చాలా ఇష్టం అని అందుకే పిల్లలు అందరూ చాచా నెహ్రూ అని పిలిచేవారని పిల్లలకు తెలియజేశారు.వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహించడం జరిగింది .పిల్లలు ఆట పాటలతో బాలల దినోత్సవ వేడుకలను ఆనంద దాయకంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్య క్రమం లో పాఠశాల మేనేజ్మెంట్ భాను తేజ్,అభిమన్యు,పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్,మాతాజీ శైలజ ముద్ర కోల ,శ్రీ విద్యా ,మంజుల,లత, సిందూజ,ప్రియాంక ,స్వరూప,వేద, శైలజ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.