ఆర్మూర్, బతుకమ్మ : జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా స్మాల్ స్కూల్ లో చిల్డ్రన్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులందరు వివిధ వేషధారణలు వచ్చి ఆకట్టుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, భాయ్ శివాజీ మహారాజ్, వివిధ వేషధారణలో పిల్లలందరూ సంబరాలు చేసుకున్నారు. స్కూల్ ప్రిన్సిపల్ షబానా గౌహర్ మాట్లాడుతూ చాచా నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజునే చాచా నెహ్రూ పేరుమీద బాలల దినోత్సవం గా జరుపుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రఫీ గౌహర్, స్టాఫ్ సవిత, సింధూర, సింధుజ, స్వప్న, ప్రసన్న, శ్రావణి, రోజా, సరిత పాల్గొన్నారు.
