- ఎలాంటి అనుమతులు లేకుండ లిటిల్ స్కాలర్ పాఠశాలలో తరగతులు నిర్వహణ
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యా శాఖ అధికారులు
- లిటిల్ స్కాలర్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ ప్రైవేటు పాఠశాలలో నిర్మాణంలో ఉన్న భవనంలో నిర్వహిస్తూ సిమెంటు సంచుల మధ్యల పాఠశాల తరగతులు నిర్వహించడం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలు గురువారం పట్టణంలోని లిటిల్ స్కాలర్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లిటిల్ స్కాలర్ ప్రైవేటు పాఠశాలలో ఇష్టానుసారంగా ధనార్జనే ధ్యేయంగా వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్తూ విద్యార్థులకు సౌకర్యాలను మాత్రం ఇవ్వడంలో పాఠశాల యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని అన్నారు. నిర్మాణంలో ఉన్న వర్ధ్యాల వలన విద్యార్థులు ఆరోగ్యం క్షీణించడమే కాకుండా శ్వాసకోస, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు .ఈ విషయమై విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కానీ అధికారులు నిర్లక్ష్యానికి గురి చేయడం ఆ పాఠశాల యాజమాన్యానికి వత్తాసు పలకడం తగదని అన్నారు పాఠశాలలో 1500 పైగా మంది విద్యార్థులు ఉంటే కనీసం 200 గజాల ఆట స్థలం కూడా లేదని విద్యార్థులకు మానసికోల్లాసం కల్పించే క్రీడలను కూడా పాఠశాల యాజమాన్యం ఆడించట్లేదని అన్నారు. వెంటనే దీనిపై ఉన్నత అధికారులు, కలెక్టర్ స్పందించి పాఠశాల యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముదాం అరుణ్, బివిఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విట్టల్, జి వి ఎస్ రాష్ట్ర నాయకులు వినోద్ చౌహన్, నాయకులు రాహుల్, శివ, వినోద్, నవీన్, ప్రసాద్, శ్రీహస్,తదితరులు పాల్గొన్నారు.