Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2025, 7:46 pm Posted by : ramakrishna

బాలలు సామాజిక సేవ చేయాలని ఉత్తర్వులు

  • బాలలంత నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంత వాసులు
  • మోటారు వాహన లైసెన్స్ లేకుండా డ్రైవింగ్
  • నిజామాబాద్ బాలల న్యాయ మండలి చైర్ పర్సన్ ఖుష్భూ ఉపాధ్యాయ్ ఉత్తర్వులు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : లైసెన్స్ లేకుండా మోటారు వాహనాలు నడిపిన ఇరవై మంది బాలలు ఐదు రోజులపాటు సామాజిక సేవ చేయాలని నిజామాబాద్ బాలల మండలి చైర్ పర్సన్ ఖుష్భూ ఉపాధ్యాయ్ (ప్రిన్స్ పల్ జూనియర్ సివిల్ జడ్జి )ఇరవై మూడు క్రిమినల్ కేసులలో తీర్పులు వెలువరించి బాలల న్యాయ మండలి చరిత్రలో నూతన అధ్యాయనం లిఖించారు. తీర్పులలోని వివరాలు.. నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారులు తమ విధులలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో గత నెల క్రితం మోటారు వాహనాల బైక్ లను డ్రైవింగ్ చేస్తున్న వారిని ఆపి చెక్ చేశారు. వారి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లు, వాహన బీమా, ఫిట్ నెస్ అధికారిక పత్రాలు లేకపోవడం గుర్తించారు. బైక్స్ నడుపుతున్న వారంత పద్దెనిమిది ఏళ్ల లోపు బాలలుగా నిర్ధారించుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నేర విచారణ పూర్తి చేసిన అనంతరం బాలల న్యాయ మండలిలో ఫైనల్ రిపోర్ట్ పైల్ చేయడంతో,మండలి చైర్ పర్సన్ ఖుష్భూ ఉపాధ్యాయుయ్ బాలలందరికి నోటీసులు పంపించి రప్పించారు. ఇరవై మూడు కేసులలో అందరిని విడివిడిగా భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 274 ప్రకారం పరీక్షించి అడగడంతో వారందరు నేరం చేశామని ఒప్పుకున్నారు.స్వచ్చందంగా నేరాలు ఒప్పుకోవడం మూలంగా మోటారు వాహన చట్టంలోని సెక్షన్స్ 181,130 రీడ్ విత్ 177 ల ప్రకారం ఒక్కొక్కరికి శిక్షకాలంగా, బాలలందరు పద్దెనిమిది ఏళ్ల వయసు వారు కలవారు కావడంతో పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం ను అనుసరించి అందరు ఆరు రోజులు సామాజిక సేవ చేయాలని జడ్జి ఉపాధ్యాయ్ తమ విడివిడి తీర్పులలో వ్రాశారు.జూన్ 23 నుండి 28 వరకు నిజామాబాద్ బాలల పరిశీలక గృహం లో సామాజిక సేవ చేయాలన్నారు.సదరు తీర్పులు బాలలు పాటించకుంటే పదిహేను రోజులు బాలల పరిశీలక గృహం పర్యవేక్షకుని నియంత్రణలో ఉండాలని పేర్కొన్నారు.ఒకే రోజు ఇరవై మూడు కేసులలో తీర్పులు వెలువడడం నిజామాబాద్ జిల్లా న్యాయ చరిత్రలో ప్రథమమని సీనియర్ న్యాయవాదులు తెలిపారు. ఏ కోర్టులలో ఇప్పటి వరకు ఇన్ని తీర్పులు లిఖించబడలేదని,ఏమైనా బాలల న్యాయ మండలి చరిత్రలో లిఖించిన నూతన అధ్యాయమని వారు అన్నారు.

  • బాలల న్యాయ మండలి ప్రతేకం..

పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లలు తెలిసి, తెలియక నేరాలు చేస్తే జూవేనైల్ జస్టిస్ యాక్ట్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం) ప్రకారం కేసులు నమోదు చేస్తారు. ఈ చట్టం అనుసారం వీరిని జైలులో కాకుండా బాలల పరిశీలక గృహంలో ఉంచి సంస్కరిస్తారు.చదువు, వృత్తులు నేర్పించడం, పరిశీలక గృహంలో చెట్ల పోషణ, మొక్కలను నాటడం తదితరాలు నేర్పించి ఉత్తమ బాలలుగా తీర్చిదిద్దుతారు.