Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 5:02 pm Posted by : ramakrishna

బీడీ కార్మికుల పిల్లలు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలి

 

. . . డాక్టర్ మహేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు ఒకటో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు చదువుతున్న వారందరూ నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (scholarships.gov.in) ద్వారా స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ మహేష్ బాబు, బీడీ కార్మిక వెల్ఫేర్ హాస్పిటల్ చీఫ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీడీ వెల్ఫేర్ హాస్పిటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన బీడీ కార్మికుల పిల్లలందరూ సమీపంలోని ఆన్‌లైన్ సేవా కేంద్రాలను సంప్రదించి నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా 2026 ఆగస్టు 31లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ విద్యా సహాయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ చదువును కొనసాగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు, వెల్ఫేర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.