నిజామాబాద్ సిటీ బతుకమ్మ : సంక్రాంతి పండగ అంటేనే మూడు రోజుల ముచ్చటైన పండగ. మొదటి రోజున భోగి పండగ గా జరుపుకుంటారు. ఈ బోగి పర్వదినం రోజున ప్రతి ఇంటి ముంగిళ్ళలో అందమైన రంగవల్లికలతో మహిళామణులు, యువతులు, చిన్నారులు తమకు నచ్చిన ముగ్గులను రంగురంగులతో అద్ది ప్రతిభను చాటుకుంటారు. ఉదయం లేచిన నుంచే చిన్నారులు అందమైన రంగులతో కూడిన రంగవల్లికలు వేసి ఆకట్టుకున్నారు. అయితే పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడుతున్న నేటి యువత ఈ చిన్నారులను చూసి ఎంతైనా నేర్చుకోవాల్సి ఉంది.
