మానవతా సదన్’ చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలి
. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లిలోని మానవతా సదన్ చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకాంక్షించారు. డిచ్ పల్లిలో కొనసాగుతున్న మానవతా సదన్ ను కలెక్టర్ సోమవారం సాయంత్రం సందర్శించారు. సుమారు రూ. 8.25 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ మానవతా సదన్ లో నూతనంగా నిర్మించదల్చిన భవన సముదాయాల కోసం స్థల పరిశీలన జరిపారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న నిర్మాణాలు, కిచెన్, స్టోర్ రూమ్,...