Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 7:04 pm Posted by : ramakrishna

మానవతా సదన్’ చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

డిచ్ పల్లిలోని మానవతా సదన్ చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకాంక్షించారు. డిచ్ పల్లిలో కొనసాగుతున్న మానవతా సదన్ ను కలెక్టర్ సోమవారం సాయంత్రం సందర్శించారు. సుమారు రూ. 8.25 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ మానవతా సదన్ లో నూతనంగా నిర్మించదల్చిన భవన సముదాయాల కోసం స్థల పరిశీలన జరిపారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న నిర్మాణాలు, కిచెన్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, డార్మెటరీ, ప్లే గ్రౌండ్, లైబ్రరీ తదితర వాటిని కలెక్టర్ సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. కొత్తగా నిర్మించిన వాటిని వినియోగిస్తూ, పాత భవనాల గదులను కూల్చివేసి వాటి స్థానంలో అన్ని సదుపాయాలతో కూడిన డార్మెటరీలు, కిచెన్, డైనింగ్ హాల్ లను బాలబాలికలకు వేర్వేరుగా నిర్మించాలని అధికారులకు సూచించారు.

Children from 'Manavata Sadan' should rise to high positions.

అనాథ పిల్లల కోసం ఉద్దేశించిన ఈ పనులను పక్కాగా, ప్రణాళికాబద్ధంగా నిర్దేశిత నమూనా మేరకు జరిపించాలని, ఎక్కడ కూడా చిన్నపాటి అవకతవకలకు తావు ఉండకూడదని అన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, తానే స్వయంగా నిర్మాణ పనుల నాణ్యతను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తానని తెలిపారు. వెంటనే పనులను చేపట్టి నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అప్పటివరకు మానవతా సదన్ బాలబాలికలకు నడిపల్లిలోని సీ.ఎం.సీ కళాశాలకు చెందిన హాస్టల్ భవనంలో వసతి కల్పించాలని సూచించారు. కాగా, మానవతా సదన్ కు చెందిన బాల బాలికలు ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తున్న కిచెన్ గార్డెన్ ను చూసి కలెక్టర్ అభినందించారు. సదన్ నిర్వహణ తీరుతెన్నుల గురించి ఎంతో ఆసక్తితో వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 

Children from 'Manavata Sadan' should rise to high positions.

అందుబాటులో ఉన్న వనరులను, జిల్లా యంత్రాంగం తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. తాము అనాథలం, తమకు తల్లితండ్రులు లేరు అనే భావన పిల్లల దరి చేరకుండా వారికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు సమకూర్చేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చొరవ చూపుతోందని అన్నారు. ఈ సందర్భంగా సదన్ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమంను కలెక్టర్ ప్రశంసిస్తూ, చిన్నారులకు తన వెంట తెచ్చిన బహుమతులను అందజేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇంచార్జి డీఈఓ సాయాగౌడ్, తహసీల్దార్ సతీష్, ఎంఈఓ జి.నరేష్, మానవతా సదన్ లైజనింగ్ ఇంచార్జ్ సుధాకర్, రమేష్ తదితరులు ఉన్నారు.