బాల్య వివాహాలను అరికట్టాలి
రుద్రూర్, బతుకమ్మ : బాల్య వివాహాలను అరికట్టాలని బాలల పరిరక్షణ జిల్లా అధికారి నాగేల్లి బాబు సూచించారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టడంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. 18 సంవత్సరాల వయసు నిండకముందు పెళ్లిలు చేయడంతో సంసార జీవితాన్ని మోయలేక ఎన్నో అనర్థాలకు దారి తీస్తుందన్నారు. బాలికలకు బలవంతంగా వివాహాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని...