- ఎంపీడీవో అనంతరావు
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఐసిడిఎంఎస్ ఆధ్వర్యంలో బాలికల బాల్య వివాహాల పట్ల నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో అనంతరావు,వైద్యాధికారి శంకర్ సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ లు హాజరయ్యారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు మాట్లాడుతూ బాలికల పట్ల చిన్నచూపు చూడద్దని వారి భవిష్యత్తును భావితారాలకు చూపేలా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు.బాల్యంలోనే వివాహాలు చేసి వాళ్ళ భవిష్యత్తును నేల పాలు చేయద్దని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో మహిళల, ఆడపిల్లల అభివృద్దే లక్ష్యంగా భవిష్యత్తును ఉన్నత శిఖరాలకు చేరిన ఘనత ఉందన్నారు.పిల్లల భవిష్యత్తు కోరకు పిల్లల తల్లిదండ్రులు గమనించి ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చదివించి మంచి మార్గంలో నడిపించాలని కోరారు.బాల్యవివాహాలకు పాల్పడినట్లయితే చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనంతరావు సబ్ ఇన్స్పెక్టర్ సందీప్వైద్యాధికారి శంకర్,ఐసిడిసిఎంఎస్ అధికారులుతదితరులు పాల్గొన్నారు.