Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 6:46 pm Posted by : ramakrishna

బాల కార్మికులను ప్రోత్సహించకూడదు

 

. . . డీఎస్ఎస్ఎ సుబేధర్ రాజ్ కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బాల కార్మికులను ప్రోత్సహించకూడదని, బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎల్ఎస్ఎ సుభేదర్ రాజ్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ బాల కార్మికుల వ్యతిరేఖ దినోత్సవ సందర్భంగా సాధన సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ చౌక్ లేబర్ అడ్డా ప్రాంతంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్ఎ సుబేధర్ రాజ్ కుమార్, మాణిక్యం పాల్గొని బాలలను వివిధ పనిలో పెట్టుకునే యజమానులపై ప్రభుత్వం విధించే శిక్షల గురించి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సాధన సిబ్బంది మధుసూదన్, వినేష్ కుమార్, నిరీక్షణ, డీఎల్ఎస్ఎ సిబ్బంది, 250 పైగా లేబర్స్ పాల్గొన్నారు.