గురుకులాల్లో పిల్లలతో వెట్టిచాకిరీ
. ‘ఎక్స్’లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజం హైదరాబాద్, బతుకమ్మ: సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. స్వీపర్లను, శానిటేషన్ సిబ్బందిని తొలగించి పిలలతో పని చేయిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కో గురుకులానికి నెలకు రూ.40వేల కేటాయించామని, ఆ నిధులను నలుగురు తాత్కాలిక ఉద్యోగులు టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేసేవారికి చెల్లించే వారని తెలిపారు. గతేడాది ఆగస్టు నుండి ప్రస్తుత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా సిబ్బందిని తొలగించిందని విమర్శించారు....