Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 8:40 pm Posted by : ramakrishna

కుక్క కాటు ఇంజక్షన్ వేసిన కొద్దిసేపటికే చిన్నారి మృతి

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప నగర్ కు చెందిన త్రీకర (2 సంవత్సరాల ఆరు నెలలు) అనే చిన్నారికి ప్రభుత్వ అసుపత్రి లో కుక్క కాటు మూడవ డోసు ఇవ్వడం జరిగింది. కుక్క కాటుకు గురైన పాపకు ఇప్పటికే రెండు డోసు లు ఇవ్వగా ఆదివారం మూడో డోస్ కోసం ప్రభుత్వ అసుపత్రి కి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంజెక్షన్ వేయించిన కొద్దిసేపటికే పాప కోమాలోకి వెళ్లి మృతి చెందినట్లు తల్లిదండ్రులు అర్చన, రమేశ్ చెప్పారు. ఆసుపత్రి వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎల్లారెడ్డి డిఎస్పి  శ్రీనివాసరావు, పట్టణ సీఐ నరహరి, రూరల్ రామన్, సీఐ భిక్కనూర్ సంపత్ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో చేరుకొని కుటుంబ సభ్యులను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం పోస్టుమార్టం కు తరలించారు.

 

Child dies shortly after being injected with dog bite