మాక్లూర్, బతుకమ్మ :
కూలర్ కరెంట్ షాక్ తో 6 సంవత్సరాల గడ్డం వేదాన్షీ అనే చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గడ్డం రచన, గడ్డం నవీన్ రోజువారి దినచర్యలో భాగంగా బీడీ వర్క్ నిర్వహించడానికి బయలుదేరారు. ప్రతిరోజు ఇద్దరు పిల్లలు ఇంటి వద్దనే వారి నానమ్మతో ఉండేవారు. ఇదే క్రమంలో ఇంట్లో ఆడుకునే పెద్ద కూతురు వేదాన్షి కూలర్ ముట్టడంతో కరెంట్ షాక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. ప్రతిరోజు చిన్నారి వస్తూపోతూ వారిని ముద్దుగా పలకరించేదని చిన్నారి ఇలా మృతి చెందడంతో స్థానికులు ద్రిగ్భాంతి వ్యక్తంచేస్తున్నారు.
