దేవరకొండ, బతుకమ్మ : నల్గొండ లోని దేవరకొండలో విషాదం చోటుచేసుకుంది. దేవరకొండ రోడ్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రాంగణంలో స్కూల్ బస్సు కింద పడి ఎల్ కె జీ చదువుతున్న చిన్నారి జస్మిత (4 ) మృతి చెందింది. బస్సును డ్రైవర్ రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.