గణనాథుని సేవలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  హైదరాబాద్, బతుకమ్మ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తమ నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజ నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామివారి కృపతో అందరికీ ఆయురారోగ్యాలు,విజయాలు కలగాలని ప్రార్థించారు. [caption id="attachment_95586" align="alignnone" width="696"] Chief Minister Revanth Reddy offers prayers to Lord Ganesha[/caption]