ఫామ్ హౌస్ లో  కోడిపందేలు, క్యాసినో గుట్టురట్టు

64 మంది అరెస్ట్ రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేసిన పోలీసులు వెబ్ డెస్క్, బతుకమ్మ :   హైదరాబాద్ శివారు మొయినాబాద్లోని తోలుకట్ట ప్రాంతంలో ఓ ఫామ్ హౌస్ లో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ గుట్టురట్టయింది.  కోడిపందేలతో పాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా 64 మందిని అరెస్ట్ చేశారు. ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు,...