64 మంది అరెస్ట్
రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేసిన పోలీసులు
వెబ్ డెస్క్, బతుకమ్మ : హైదరాబాద్ శివారు మొయినాబాద్లోని తోలుకట్ట ప్రాంతంలో ఓ ఫామ్ హౌస్ లో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ గుట్టురట్టయింది. కోడిపందేలతో పాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా 64 మందిని అరెస్ట్ చేశారు. ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్స్డ్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడికత్తులను ఎస్ ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆర్గనైజర్ భూపతి రాజు కేటీ ఆర్ అనుచరుడని తెలుస్తోంది. ఈ ఫాంహౌస్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దని, అద్దెకిచ్చినట్లు సమాచారం.