Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 4:46 pm Posted by : ramakrishna

గుండె నేమ్లి గ్రామంలో వైభవంగా చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ

 

. . . ధైర్యానికి, ధీరత్వానికి మారుపేరు చత్రపతి శివాజీ

 

. . . గుండె నేమ్లి సర్పంచ్ కే మోహన్ రెడ్డి

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

ధైర్యానికి, ధీరత్వానికి మారు పేరు చత్రపతి శివాజీ అని గుండె నేమ్లి సర్పంచ్ కే మోహన్ రెడ్డి అన్నారు. బిచ్కుంద మండల పరిధిలోని గుండె నేమ్లి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని,రాబోయే భావి తరాలు ధర్మాన్ని అనుసరించి ముందుకు సాగాలన్నారు. గ్రామంలో శివాజీ విగ్రహం పెట్టడం మాత్రమే కాకుండా ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. తాళి కట్టిన తన భార్య తప్ప.. దేశంలోని సోదరీమణులు అందరూ నాకు తన తల్లితో సమానం అని అన్న మహోన్నతమైన వ్యక్తి శివాజీ మహారాజ్ అని అన్నారు. హిందువుల రక్షణ కొరకు శివాజీ ఎంతో కృషి చేశారని, ఎంతోమంది వీరులను తయారుచేసిన వీరపురుషుడు అని ఆయన కొనియాడారు. దేశం కోసం ప్రాణాలను వదిలేందుకు సైతం సిద్ధపడాలని శివాజీ సూచించినట్లు గుర్తు చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

 

Chhatrapati Shivaji statue unveiled in Gunde Nemli village

అనంతరం పలువురు అతిథులు మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కొరకు శివాజీ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తన సహస్ర శైలిని ప్రదర్శించిన వ్యక్తి అని వారు కొనియాడారు. బంగ్లాదేశ్ లో హిందువులపై ఎన్నో అరాచకాలు జరిగాయని, అరాచకాలు ఆగాలంటే రాబోయే రోజులలో ప్రతి ఒక్క హిందువు శివాజీ మాదిరిగానే పోరాడాలన్నారు. భాషా, కులాలు వేరైనా ప్రతి ఒక్కరూ శివాజీ బాటలో నడవాలని వారు సూచించారు. ప్రతి స్త్రీని తల్లిగా చూడటం యువత అలవర్చుకోవాలన్నారు. హిందువులలో చైతన్యం రావాలని, ధర్మ రక్షణ.. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు గ్రామాలలో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హిందువులు ఎవరికి వ్యతిరేకత కాదని, చరిత్ర చూస్తే హిందువులు ఎవరిపైన దాడులు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో గుండె నేమ్లి సర్పంచ్ కే మోహన్ రెడ్డి, శివాజీ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

 

Chhatrapati Shivaji statue unveiled in Gunde Nemli village