ఉపాధ్యాయులను సన్మానించిన చెరుకు విజయ్ రెడ్డి 

బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్ర పరిధిలో నూతన ఉపాధ్యాయ ఉద్యోగులను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చెరుకు (విజయ్ రెడ్డి) అమర్ ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్  ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించిందని,   కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని తెలిపారు. ఎన్నో ఏండ్లు ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు డీఎస్సీ ద్వారా వారి కల  నెరవేరిందని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయి...