బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్ర పరిధిలో నూతన ఉపాధ్యాయ ఉద్యోగులను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చెరుకు (విజయ్ రెడ్డి) అమర్ ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని తెలిపారు. ఎన్నో ఏండ్లు ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు డీఎస్సీ ద్వారా వారి కల నెరవేరిందని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయి ఉద్యోగాలలో ముందుకు కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మద్దెల రాజేశం, ఉపాధ్యక్షుడు హర్షద్,మాజీ ఎంపీపీ గజ్జల సాయిలు, మల్లు పల్లి గ్రామం మాజీ సర్పంచ్ భూపతి గౌడ్, అల్వాల గ్రామం మాజీ సర్పంచ్ కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూమా గౌడ్, చెన్నై భూపాల్ గౌడ్ మహేష్, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మహమ్మద్ జహంగీర్, మహేందర్ రెడ్డి, నెరేటి రాజు, విజయపాల్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.