కానిస్టేబుల్ నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి
బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పెంబర్తి కిషన్ తమ్ముడు పోలీస్ కానిస్టేబుల్ పెంబర్తి నవీన్ విధులు పూర్తిచేసుకుని వస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ విషయం తెలుసుకున్న, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వారి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు....