Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 November 2024, 6:31 pm Posted by : ramakrishna

కానిస్టేబుల్ నవీన్  కుటుంబాన్ని పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి 

 బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పెంబర్తి కిషన్ తమ్ముడు  పోలీస్ కానిస్టేబుల్ పెంబర్తి నవీన్ విధులు పూర్తిచేసుకుని  వస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ విషయం తెలుసుకున్న, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి  వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.  వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వారి కుటుంబానికి సహాయ సహకారాలు   అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.