వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

దుబ్బాక బతుకమ్మ : మిరుదొడ్డి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకారం  ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి , పీఏసీఎస్ చైర్మన్ రాజలింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. దళారులను నమ్మకుండా ప్రభుత్వ కేంద్రాలలో వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని రైతులను కోరారు. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో...