Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2024, 7:15 pm Posted by : ramakrishna

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

దుబ్బాక బతుకమ్మ : మిరుదొడ్డి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకారం  ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి , పీఏసీఎస్ చైర్మన్ రాజలింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. దళారులను నమ్మకుండా ప్రభుత్వ కేంద్రాలలో వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని రైతులను కోరారు. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మిద్దె రాజేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, తాజా మాజీ ఎంపీపీ గజ్జల సాయిలు, మాజీ ఏఎంసీ చైర్మన్ నేరెళ్ల భూమా గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్లు, తాజా మాజీ సర్పంచులు అల్వాల కిష్టయ్య, భూపతి గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపాల్ గౌడ్, సారంగ సురేష్, మిద్దె మహేష్, మహేందర్ రెడ్డి, బాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.