. . . జైలుశిక్ష నిర్ధారణ
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
చెక్ బౌన్స్ అప్పీలును కొట్టివేస్తు నిజామాబాద్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి హరీష తీర్పు చెప్పారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన తీగల రఘు గౌడ్ నిజామాబాద్ నగరంలోని పూసల గల్లికి చెందిన సాదుల వెంకట్రామ్ దగ్గర రేడిమెడ్ దుస్తులు కొంత నగదుకు మరికొంత ఉద్దెరకు తెచ్చుకుని వ్యాపారం చేసుకునేవాడు. వ్యాపార విషయంలో వారి మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడింది. 2017 సంవత్సరంలో 1 లక్ష 23 వేల 885 రూపాయల విలువగల దుస్తులు కొనుగోలు చేసిన రఘు గౌడ్ 43 వేల రూపాయలు నగదు చెల్లించి మిగతా 80 వేలు ఉద్దెర పెట్టాడు. డబ్బులు చెల్లించమని వెంకట్రామ్ చాలాసార్లు అడుగగా 50 వేలకు సరిపడా హెచ్ డి సి బ్యాంక్ చెక్ ఇచ్చి మిగతా డబ్బులకు మల్లి చెక్ అయిన నగదు అయిన ఇస్తానని చెప్పాడు. సదరు బ్యాంక్ చెక్ ను వెంకట్రామ్ నిజామాబాద్ లోని సిండికేట్ బ్యాంక్ బ్రాంచ్ తన బ్యాంక్ ఖాతాలో జమ చేయవలసిందిగా బ్యాంక్ అధికారులకు ఇచ్చాడు.ఆన్ లైన్ ట్రాంజాక్షన్ నిర్వహించిన బ్యాంక్ అధికారులు రఘు గౌడ్ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఖాతాలో సరిపడ నగదు నిల్వలు లేవని తెలుపుతూ మెమో ను ఇచ్చారు. న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ పంపి, నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిర్యాదు దాఖలు చేశాడు. పిర్యాదును స్వీకరించిన కోర్టు రఘు కు నోటీసులు పంపి కోర్టుకు హాజరు కావాలని కోరింది. ఇరు పక్షాల వాదనలు, సాక్ష్యాలు నమోదు చేసిన కోర్టు చెక్ బౌన్స్ నేరానికి గాను రఘు కు రెండు నెలల జైలుశిక్ష ను విధిస్తు చెక్ లో పేర్కొన్న 50 వేలు చెల్లించాలని తీర్పు నిచ్చారు.50 వేలు చెల్లించకుంటే మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. దిగువ కోర్టు తీర్పును రఘు గౌడ్ జిల్లా సెషన్స్ కోర్టులో అప్పీలు చేశాడు. దిగువ కోర్టు తీర్పును సమర్దిస్తూ అప్పీలును కొట్టివేస్తు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి హరీష తీర్పు చెప్పారు.