కోటయ్య క్యాంప్ లో చిరుత సంచారం

బాన్సువాడ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంప్ పరిసరాలల్లో చిరుత సంచరిస్తోంది. బుధవారం అర్ధరాత్రి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పరిసరాల్లోని సుబానీ ఇంటి వద్ద పెంపుడు కుక్క పై దాడి చేసింది. కుక్క అరుపులు విని సుబాని తలుపులు తీశాడు. చిరుతను చూసిన ఆయన భయంతో మళ్లీ మూసేశాడు. మరుసటి రోజు ఉదయం కుక్కను చికిత్స నిమిత్తం పశువుల దవాఖానకు తీసుకెళ్లాడు.