Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 1:40 pm Posted by : ramakrishna

ఆర్మూర్ డివిజన్ లో అక్రమ ఇసుక రవాణాపై చీతా ఫోర్స్ దాడి

 

. . . రెండు లారీలు సీజ్

 ఆర్మూర్, బతుకమ్మ:

ఆర్మూర్ , మోర్తాడ్ లో అక్రమ ఇసుక రవాణాపై చీతా ఫోర్స్ మెరుపు దాడులు  నిర్వహించి రెండు భారీ లారీలు పట్టుకున్నట్టు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ ఇసుక రవాణా , మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సి.సి.ఎస్ ఏసీపీ ఇన్‌చార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీత ఫోర్స్ సిబ్బంది నిత్యం ప్రత్యేక నిఘా నిర్వహిస్తూ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.. మోర్తాడ్ ,ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చీత ఫోర్స్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించారు .తనిఖీల్లో రెండు 14 టైర్ల భారీ వాహనాల్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, రవాణా పత్రాలు లేదా మైనింగ్ సంబంధిత డాక్యుమెంట్స్ లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన లారీలు తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత మోర్తాడ్ ,ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లకు అప్పగించారు.Cheetah Force raids illegal sand transport in Armor Division