నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలోని నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి చేసింది. ఆదివారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నిర్వహించిన మెరుపు దాడి లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న 7 మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ముగ్గురు విటులు, నలుగురు మహిళలు ఉన్నారు.వారి నుంచి 7 మొబైల్ ఫోన్లు రూ. 4,870 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎడుగురిని నాల్గవ టౌన్ పోలిసులకు అప్పగించారు. అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా, జూదం వంటి చట్ట విరుద్ధ చర్యలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి అని సిపి కోరారు.