అక్రమ ఇసుక తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

  ఏర్గట్ల, బతుకమ్మ :   తడపాకల పెద్ద వాగు ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి చేసింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, సి.సి.ఎస్ ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ సిబ్బంది అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఏర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తడపాకల పెద్దవాగు ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో చీతా ఫోర్స్ బృందం ఆకస్మిక దాడి నిర్వహించింది....