Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 7:28 pm Posted by : ramakrishna

చేపూర్ శివారులో ఫాం హౌజ్ పై చీతా ఫోర్స్ దాడి

 

. . . ముగ్గురు పేకాట రాయుళ్ల అరెస్ట్

 

ఆర్మూర్, బతుకమ్మ:

 

ఆర్మూర్ పట్టణ శివారు లోని చేపూర్ గ్రామం లో ఒక ఫాం హౌజ్ పై చీతాపోర్స్ దాడి నిర్వహించింది. జూదం  పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆర్మూర్ పరిధిలో ఒక పెద్ద పేకాట స్థావరాన్ని బట్టబయలు చేశారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేపూర్ శివార్లలో గల సాయన్న ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున పేకాట సాగుతున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. ఈ సమాచారంతో  సిసిఎస్  ఏసీపీ మస్తాన్ అలీ ప్రత్యక్ష పర్యవేక్షణలో చీతా ఫోర్స్ సిబ్బంది అత్యంత వ్యూహాత్మకంగా , అకస్మాత్తుగా (మెరుపు దాడి) సాయన్న ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన జూదరులను సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మెరుపు దాడిలో పోలీసులు ముగ్గురు (3) పేకాట రాయుళ్లను సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 18,300 నగదు, జూదం ఆడటానికి వచ్చిన వారు ఉపయోగించిన 2 క్రేటా (క్రెటా) కార్లు, కమ్యూనికేషన్ కోసం వాడిన 3 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) కు అప్పగించారు. ఆర్మూర్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.